చర్మ సంరక్షణ గురించి మనం నిజం అనుకునే కొన్ని అబద్ధాలు…

-

మన శరీరంలో అతిపెద్ద అవయవ చర్మం. అందుకే మనకి చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు, చాలా తొందరగా వస్తాయి కూడా. రుతువు మారినప్పుడల్లా ఒక్కోరకమైన చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఐతే చర్మం గురించి మనం నిజం అనుకునే కొన్ని అబద్ధాలని ఈ రోజు తెలుసుకుందాం.

రోజులో ఎక్కువ సార్లు ముఖం కడగకపోతే మొటిమలు ఏర్పడతాయి.

ఇది అందరికీ వర్తించదు. చాలా మంది తమ ముఖాన్ని మూడు కంటే ఎక్కువ సార్లు కడుగుతారు. అయినా కూడా మొటిమలు ఏర్పడతాయి. మొటిమలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.

తరచుగా మేకప్ వేసుకోవడం వల్ల ముడుతలు ఏర్పడతాయి.

ఇది కూడా పూర్తిగా నిజం కాదు. మేకప్ వేసుకోవడం వల్ల కంటే పడుకునేటపుడు మేకప్ తీయకపోవడం వల్లే ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడైనా నిద్రపోయే ముందు ఖచ్చితంగా మేకప్ ని పూర్తిగా తీసివేయాలి.

స్నానం చేసేటపుడు స్క్రబర్ తో గట్టిగా రుద్దితే చర్మం మెరుగవుతుంది.

ఇది అస్సలు నిజం కాదు. చర్మాన్ని గట్టిగా రుద్దడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. చర్మ కణాలకి హాని కలుగుతుంది.

మీరు వాడే ప్రోడక్ట్ మీ చర్మానికి మంట కలిగిస్తుంటే ఆ ప్రోడక్ట్ మంచిది..

ఇది నిజం కానే కాదు. చర్మానికి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయిన చాలా మృదువుగా ఉండాలి. మీ చర్మాన్ని ఇబ్బంది పెట్టే ప్రోడక్టులని అస్సలు వాడకండి.

మీ చర్మం ఆయిన్ స్కిన్ అయితే మాయిశ్చరైజర్ అవసరం లేదు.

ఆయిల్ స్కిన్ కి మాయిశ్చరైజర్ కి సంబంధం లేదు. ఆయిల్ స్కిన్ అయినా మాయిశ్చరైజర్ వాడటం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news