అక్బరుద్దీన్ ఓవైసీకి ఘోర పరాభవం..ప్రసంగం మధ్యలోనే ఆపేసి !  

ముషీరాబాద్ భోలక్ పూర్ లో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ముషీరాబాద్ వార్డ్ నెంబర్ 86 ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ నీ స్థానికులు అడ్డుకోవడంతో ఆయన ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెనుదిరిగాడు. ముస్లిం వర్గీయులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడి నుంచి మాట్లాడండి వెనుదిరిగారు అక్బర్.

మాకు రాజకీయ మాటలు అవసరం లేదు అభివృద్ధి అవసరమని ముషీరాబాద్ నియోజకవర్గ స్థానికులు ఆయనకు షాక్ ఇచ్చారు. స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో చాలా సేపు వారిని సముదాయించాలని చూసి అయినా వారు వినకపోవడంతో అసంతృప్తితో ఎన్నికల ప్రచారం అలానే ప్రసంగం మధ్యలోనే ఆపేసి అక్బరుద్దీన్ ఓవైసీ వెనుదిరిగారు.