ఈనెల 24న నేచురల్ స్టార్ నాని సూపర్ హిట్ మూవీ రీరిలీజ్

-

ప్రస్తుతం టాలీవుడ్​లో రీ రిలీజ్​ల ట్రెండ్ నడుస్తోంది. మొన్నటిదాకా పవర్ స్టార్, మెగాస్టార్ వంటి స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రీరిలీజ్ చేసేవాళ్లు. ఇప్పుడు హీరోల స్టార్​డమ్​తో సంబంధం లేకుండా ఒకప్పుడు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలు.. థియేటర్​లో విడుదలై అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయి.. టీవీల్లో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను నిర్మాతలు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.

అలా థియేటర్​లో హిట్ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత టీవీలోనూ తన సత్తా చాటిన నేచురల్ స్టార్ నాని మూవీని రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నాని కెరీర్​లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ ‘అలా మొదలైంది’.

నిత్యా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ మూవీతోనే నిత్య టాలీవుడ్​కు పరిచయమైంది. ఈ సినిమాలో నాని, నిత్యల కెమిస్ట్రీకి అప్పట్లో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయబోతున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news