అల‌ర్ట్‌.. 70 ల‌క్ష‌ల మంది భార‌తీయుల క్రెడిట్‌, డెబిట్ కార్డుల వివ‌రాలు లీక్‌..

-

దేశ‌వ్యాప్తంగా ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగ‌దారుల‌కు షాకింగ్ న్యూస్‌. మొత్తం 70 ల‌క్ష‌ల మందికి చెందిన కార్డుల వివ‌రాల‌తోపాటు వారి ఫోన్ నంబ‌ర్లు, ఈ-మెయిల్ ఐడీలు త‌దిత‌ర స‌మాచారం అంతా డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉంద‌ని ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ రీసెర్చ‌ర్లు వెల్ల‌డించారు. వారి పేర్లు, వారు ఉద్యోగం చేసే కంపెనీల వివ‌రాలు, వార్షిక ఆదాయం వంటి వివ‌రాలు కూడా లీక్ అయ్యాయ‌ని నిర్దారించారు.

alert 70 lakhs indians debit and credit cards info leaked in dark web

కాగా లీక్ అయిన వివ‌రాల‌కు చెందిన డేటాబేస్ సైజ్ 2జీబీగా ఉంద‌ని తెలిపారు. 2010 నుంచి 2019 వ‌ర‌కు ప‌లువురు కార్డు వినియోగ‌దారుల‌కు చెందిన డేటా లీక్ అయిన‌ట్లు నిర్దారించారు. డేటాను బ్యాంకుల‌కు సేవ‌లు అందించే థ‌ర్డ్ పార్టీ కంపెనీల‌కు చెందిన వారే లీక్ చేసి ఉంటార‌ని నిపుణులు తెలిపారు. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ప్ర‌జ‌ల‌కు చెందిన సాధార‌ణ స‌మాచారం క‌న్నా వారి బ్యాంకింగ్ స‌మాచారానికే ఎక్కువ డిమాండ్ ఉంద‌న్నారు. అందువ‌ల్లే ఎవ‌రైనా ఆ డేటాను హ్యాక‌ర్ల‌కు, స్కామర్ల‌కు అమ్మి ఉంటార‌ని భావిస్తున్నారు.

అయితే డేటా లీక్ అయిన నేప‌థ్యంలో కార్డుల వినియోగదారులు వెంట‌నే త‌మ కార్డుల పిన్ నంబ‌ర్‌లు, అకౌంట్ల పాస్‌వ‌ర్డ్‌ల‌ను మార్చుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. ఇక స‌ద‌రు 70 లక్ష‌ల మందికి చెందిన పాన్ కార్డుల స‌మాచారం కూడా లీకైన‌ట్లు నిర్దారించారు.

Read more RELATED
Recommended to you

Latest news