ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్లకు అల‌ర్ట్‌.. ఆన్‌లైన్ మోసాల ప‌ట్ల ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌లు..

-

దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్రచార‌మ‌వుతున్న త‌ప్పుడు వార్త‌ల‌ను, త‌ప్పుదోవ ప‌ట్టించే వార్త‌ల‌ను, మెసేజ్‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించింది. త‌ప్పుడు మెసేజ్‌ల‌కు స్పందించి క‌స్ట‌మ‌ర్లు న‌ష్ట‌పోవ‌ద్ద‌ని ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

Alert for SBI customers .. SBI alerts for online scams ..

సోష‌ల్ మీడియాలో ప్రచార‌మ‌వుతున్న ఫేక్‌, మిస్‌లీడింగ్ మెసేజ్‌ల ప‌ట్ల స్పందించ‌కూడ‌ద‌ని మా క‌స్ట‌మ‌ర్ల‌ను కోరుతున్నాం.. అంటూ ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

కాగా ఎస్‌బీఐ ఇదే విష‌య‌మై ట్విట్ట‌ర్‌లో 20 సెక‌న్ల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేసింది. కస్ట‌మ‌ర్లు త‌మ వ్య‌క్తిగ‌త, బ్యాంకింగ్ స‌మాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేయ‌కూడ‌ద‌ని తెలిపింది.

అప్ర‌మ‌త్తంగా ఉండండి, సుర‌క్షితంగా ఉండండి. సోష‌ల్ మీడియాలో ఇత‌రుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్న‌ప్పుడు వారి అకౌంట్ల‌ను ఒక‌సారి చెక్ చేసి వెరిఫై చేసుకోండి. ర‌హ‌స్య‌మైన వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో ఇత‌రుల‌కు షేర్ చేయ‌కండి.. అంటూ ఎస్‌బీఐ ఆ వీడియోతోపాటు ట్వీట్ చేసింది.

అయితే ఎస్‌బీఐ ఇలా క‌స్ట‌మ‌ర్ల‌ను అల‌ర్ట్ చేయ‌డం ఇది కొత్తేమీ కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇలా ఎస్‌బీఐ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు చేస్తూనే ఉంటుంది. ప్ర‌స్తుతం సైబ‌ర్ నేరాలు ఎక్కువైన దృష్ట్యా ఎస్‌బీఐ ఇలాంటి హెచ్చ‌రిక‌ల‌ను చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news