స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇలా చెయ్యద్దు..!

మోసాల గురించి కొత్తగా చెప్పేదేముంది. ఈ మధ్యకాలంలో మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి మోసాల బారిన పడితే అనవసరంగా చిక్కుల్లోపడతారు. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకు అకౌంట్ ఉందా..? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయకండి. స్టేట్ బ్యాంక్ పేరుతో ఫేక్ కాల్స్ వస్తున్నాయి అని చెప్పింది. కాబట్టి స్టేట్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిక జారీ చేసింది. కస్టమర్లకి ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తెలిపింది. మోసపూరిత నెంబర్స్ నుండి వచ్చే లింకుల పైన క్లిక్ చేయద్దు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ని కోరింది. అలానే ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వచ్చి.. కేవైసీ అప్డేట్ చేయమని అడిగితే మీరు అలా చేయొద్దు.

అలానే అనుమానాస్పద లింకుల పైన క్లిక్ చేయద్దు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఎప్పుడూ కూడా కేవైసీ గురించి కాల్ చేయదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అలానే ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా లింక్ మీద క్లిక్ చేయండి అని వస్తే అసలు క్లిక్ చెయ్యద్దు. ఏటీఎం పిన్, పాస్వర్డ్, ఇంటర్నెట్ బ్యాంక్, యూజర్ ఐడి వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి.

ఎవరైనా ఫోన్ చేసి అడిగినా చెప్పకండి. ఆర్బీఐ కార్యాలయం, పోలీస్, కేవైసీ, అథారిటీ పేరుతో ఫోన్ కాల్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అలానే బ్యాంక్ ఖాతా నెంబర్, పాస్వర్డ్, ఏటీఎం కార్డు నెంబర్ కి ఫోటో తీస్తే కూడా ఆ సమాచారం లీక్ అయ్యే ప్రమాదం వుంది.