పాన్ కార్డు ఉందా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..!

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్ల లో పాన్ కార్డు కూడా ఒకటి. ట్రాన్సాక్షన్స్ చేయడానికి మొదలు ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ చాలా అవసరం. అయితే పాన్ కార్డ్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి సక్రమంగా వాడాలి అని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అంటోంది.

ఏ చిన్న తప్పు అయినా సరే పాన్ కార్డు కి సంబంధించి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి అని అంటోంది. ఒక వ్యక్తికి ఒకటే పాన్ కార్డు ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ వుండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఇన్‌కమ్‌టాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 272B నిబంధన ప్రకారం ఫైన్ కట్టాల్సి వుంది. చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం రెగ్యులేటరీ బాడీకి ఉందట.

పైగా ఇలా ఒకటి కంటే ఎక్కువ కార్డ్స్ ఉంటే బ్యాంకు అకౌంట్‌ను నిలిపివేసేయచ్చు కూడా. కనుక తప్పక జాగ్రత్తగా ఉండాలి. రూ.10 వేల వరకు జరిమానా కూడా పడచ్చు. మీ దగ్గర ఉన్న రెండో పాన్ కార్డును కనుక మీరు సరెండర్ చేసేస్తే పెనాల్టీ నుండి తప్పించుకోవచ్చు. అదనంగా ఉన్న పాన్ కార్డును సరెండర్ ని ఇలా చేసేయండి.

ముందు www.incomettaxindia.gov.com లోకి వెళ్ళండి.
‘రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్ అండ్ ఛేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా’ పై నొక్కండి.
దరఖాస్తు పత్రం డౌన్‌లోడ్ చేసి…ఫారంను నింపాలి.
ఇప్పుడు మీరు ఏదైనా ఎన్‌ఎస్‌డీఎల్ ఆఫీసుకు వెళ్లి సబ్మిట్ చేయాలి. అంతే సరిపోతుంది.