నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది…ఆలియా భట్..!

-

అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయిన హిందీ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ఇలా ఇప్పటికే హిందీ సినిమాల ద్వారా తెలుగులో ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఆలియా భట్, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా మార్చ్ 25 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు ఆలియా భట్, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగూభాయ్ కతియావాడి’ సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ స్పీడ్ మీదున్న ఉన్న ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

కరోనా మహమ్మారి రాకుండా ఉండి ఉంటే ఇప్పటికే తమ పెళ్లి అయిపోయి ఉండేదని ఆ మధ్య ఓ సందర్భంలో రణ్ బీర్ కపూర్ తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ఈ విషయంపై తాజాగా ఆలియా భట్ స్పందిస్తూ… రణబీర్‌తో మానసికంగా తన పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని తెలిపింది. తన మైండ్ లో రణబీర్ కపూర్ తన భర్త అని ఆలియా భట్ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news