ఆ యాడ్స్ ని ఇక ఆపేయాలి.. వినియోగదారులకి మోసం చేస్తున్నారు అంటూ నోటీసులు..!!

-

యాడ్స్ విషయంలో కూడా తప్పులు జరగకూడదు. కానీ చాలా కంపెనీలు వీటి కోసం పట్టించుకోవు. అయితే నిజానికి యాడ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. యాడ్‌ను ప్రసారం చేస్తున్న గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌కు పెద్ద షాక్ ఏ తగిలింది అనే చెప్పాలి. ఈ సంస్థ మన భారత దేశంలో ప్రసారం చేస్తున్న సెన్సొడైన్‌ యాడ్ ని ఆపేయాలని ఆదేశాల్ని ఇవ్వడం జరిగింది.

 

కన్సూమర్‌ ప్రొటెక్షన్‌ రెగులేటర్‌ ఈ ఆదేశాల్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల లోకి వెళితే.. నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఉన్నాయని తెలిపారు. అదే విధంగా న్యాప్టాల్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ లిమిటెడ్‌ పైన కూడా మండిపడింది. కన్సూమర్‌ ప్రొటెక్షన్‌ రెగులేటర్‌ ఇదే తరహా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యాడ్స్ తో కంపెనీ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. అయితే న్యాప్టాల్‌కు రూ.10 లక్షల జరిమానాని విధించడం జరిగింది.

కన్సూమర్‌ ఎఫైర్స్‌ మినిస్ట్రీ బుధవారం ఒక ప్రకటనని కూడా చేసింది. జవనరి 27వ తేదీన గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ కి.. ఫిబ్రవరి 2వ తేదీన న్యాప్టాల్‌కు ఆదేశాల్ని ఇచ్చారు. అయితే GSK ఇండియాలో ఇస్తున్న అడ్వెర్టైస్‌మెంట్లను ఏడు రోజుల్లోపు ఆపేయాలని చెప్పింది CCPA.

ఇది ఇలా ఉంటే ఈ యాడ్ లో విదేశాలకి చెందిన డెంటిస్టులు ఈ పేస్ట్ ని వాడమని చెప్పారని అలా ఉండకూడదని.. ఇండియాలో ప్రోడక్ట్స్ కి ఇండియన్స్ ఏ చెప్పాలని అన్నారు. యాడ్ పక్కదారి పట్టిస్తోందని కూడా చెప్పారు. కన్సూమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2019, సెక్షన్‌ 2(28) మేరకు వాణిజ్య ప్రసారాల నిబంధనలు అతిక్రమించారని చెప్పడం జరిగింది. దీనిపై డైరెక్టర్‌ జనరల్‌ విచారణ జరిపి 15 రోజుల్లోగా రిపోర్టుని ఇవ్వాలని సీసీపీఏ అంది.

అదే విధంగా న్యాప్టాల్‌కు కూడా సీసీపీఏ నోటీసు ఇచ్చింది. యాడ్ ని ఆపేయాలని అంది. సెట్‌ ఆఫ్‌ 2 గోల్డ్‌ జ్యూయలరీస్‌, మ్యాగ్నెటిక్‌ నీ సపోర్ట్‌, ఆక్యుప్రెసర్‌ యోగా స్లిప్పర్స్‌ వంటి ప్రోడక్ట్స్ పై చేస్తున్న యాడ్స్ ని ఆపేయాలని అంది. ఇరవై నాలుగు గంటలూ ఇలాంటి అడ్వెర్టైస్‌మెంట్లను దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారం చేస్తున్నారు దీనితో ఎక్కువ మంది మోసపోతారని చెప్పారు.

న్యాప్టాల్‌కు రూ.10 లక్షల జరిమానా కూడా విధించారు. 2021 మే నెల నుంచి 2022 జనవరి వరకు న్యాప్టాల్‌పై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ 25 రోజుల్లోగా అందించాలని చెప్పడం కూడా జరిగింది. మే నుండి ఈ జనవరి దాకా 399 కంప్లైంట్స్‌ న్యాప్టాల్‌ మీద వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news