Official: మూడు ముళ్ళతో ఒక్కటైన రణ్‌బీర్ – అలియా.. ఫోటోలు వైర‌ల్

-

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ ర‌ణ్‌బీర్ క‌పూర్ – అలియా భ‌ట్ మూడు ముళ్ల‌తో ఒక్క‌టైయ్యారు. బీ టౌన్ తో పాటు ర‌ణ్ బీర్‌, అలియా భ‌ట్ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న తంతూ ఎట్ట‌కేల‌కు ఈ రోజు జ‌రిగింది. ర‌ణ్ బీర్ క‌పూర్ – అలియా భ‌ట్ ల వివాహం పంజాబ్ సంప్ర‌దాయ ప‌ద్దతిలో ఘ‌నంగా నిర్వ‌హించారు. బాంద్రాలోని వాస్తు అపార్ట్ మెంట్ లో వీరి వివాహం జ‌రిగింది. అతి కొద్ది మంది అతిథిల మ‌ధ్య ర‌ణ్ బీర్ క‌పూర్ – అలియా భ‌ట్ వివాహా బంధంలోకి అడుగు పెట్టారు.

అలియా భ‌ట్, ర‌ణ్ బీర్ క‌పూర్ త‌ల్లి దండ్రుల‌తో పాటు ప‌లువురు స్నేహితులు, బంధువులు మాత్ర‌మే ఈ వివాహ వేడుక‌కు హాజ‌రు అయ్యారు. ఈ పెళ్లి వేడుక కు సంబంధించిన విషయాలు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని అలియా – ర‌ణ్ బీర్ అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు. పెళ్లి మండ‌పానికి కెమెరాలు గానీ, సెల్ ఫోన్ ల‌ను గానీ అనుమ‌తించ‌లేదు.

కేవ‌లం అలియా – ర‌ణ్ బీర్ అధికారికంగా నియ‌మించుకున్న కెమెరా మిన‌హా.. మిగితా వాటికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. పెళ్లి తంతూ ముగిసిన అనంత‌రం అలియా – ర‌ణ్ బీర్ తమ ఫోటోల‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news