గర్భాన్ని భర్త బ్లేజర్ తో కప్పేస్తున్న అలియా భట్..!!

-

బాలీవుడ్ నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అలియా బట్ గర్భం దాల్చిన విషయం తెలిసిందే. స్త్రీ అయినా సరే గర్భం దాల్చిన తర్వాత వారి శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి ఈ క్రమంలోనే ఈమె ముఖంలో కూడా మార్పులు మనం గమనించవచ్చు. ఇకపోతే గర్భం దాల్చిన తర్వాత కూడా తగ్గేదేలే అంటూ విదేశాలలో సైతం షూటింగ్లలో పాల్గొంటూ ఇరగదీస్తోంది ఈ ముద్దుగుమ్మ .ముఖ్యంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే యధావిధిగా షూటింగ్లను పూర్తి చేస్తోంది. ఇక అందులో కూడా ప్రమాదకరమైన యాక్షన్స్ సన్నివేశాలలో సైతం ఈమె పాల్గొంది అంటే ఇక ఈమె ధైర్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .ఇక ఆ రకంగా చూసుకున్నట్లయితే పని పట్ల వృత్తిపట్ల తన నిబద్ధతను చాటుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఎవరైనా సరే గర్భం దాల్చిన తర్వాత ఇలాంటి పనులు చేయాలి అంటే ఎన్నో ధైర్య సాహసాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకే ఇలాంటి ఫీట్లు సాధ్యమవుతాయి. ఇక ఈ తరం కొత్తగా వచ్చే హీరోయిన్ లకు ఈమె సాహసాలే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇక ఈమె నటించిన డార్లింగ్స్ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె దగ్గరుండి ప్రమోషన్స్ పనులు పూర్తి చేస్తూ ఉండడం గమనార్హం. మరొక విషయం ఏమిటంటే నెలలు నిండుతున్న కూడా ఈమె విశ్రాంతి తీసుకోకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఎత్తయిన పొట్టతో కనిపించింది .ఇకపోతే ఆమె నెలలు నిండుతున్న పొట్టను క్లియర్ గా చూడవచ్చు.వదులుగా ఉండే దుస్తులపై బ్లేజర్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఆ బ్లేజర్ తనది కాదట.. తన భర్త రణబీర్ బ్లేజర్ ను తనతో పాటు తీసుకొచ్చినట్లు సమాచారం. యానిమాల్ షూటింగ్ సమయం లో రన్బీర్ ఈ బ్లేజర్ లో కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news