ఇన్​స్టాగ్రామ్​లో ఆలియా భట్ కూతురి ఫొటో వైరల్..!

-

బాలీవుడ్​ పవర్​ కపుల్​ రణబీర్​ కపూర్​, ఆలియా భట్​లకు గతేడాది నవంబర్​లో పండంటి ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. తమ గారాలపట్టికి ఈ జంట రాహా అని నామకరణం చేశారు. కానీ ఇంతవరకు ఆమె ముఖాన్ని.. కెమెరాలకు చూపించలేదు. సోషల్ ​మీడియాలోనూ ఒక్క ఫొటో కూడా పోస్ట్​ చేయలేదు. రాహాకు రెండేళ్లు వచ్చే వరకు.. ఫొటోలు పోస్ట్​ చేయమని ఆలియా చెప్పిన సంగతి తెలిసిందే.

ఇంతలో ఇన్​స్టాగ్రామ్​లో ఆలియ కూతురి ఫొటో అంటూ ఓ క్యూట్ బేబీ ఫొటో వైరల్ అవుతోంది. ఆలియా తన ఇన్​స్టాలో కొన్ని చిన్నపిల్లల ఫొటోలు పోస్టు చేసింది. అందులో పింక్ కలర్ డ్రెస్​లో ఉన్న చిన్నారి క్యూట్​గా అచ్చం బుల్లి ఆలియాలాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు అది రాహా ఫొటోనేనని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఆలియా భట్​ తన ఫ్యాషన్ బ్రాండ్ ఎడా మమ్మా కోసం ఓ ప్రమోషనల్ షూట్ చేసింది. ఈ బ్రాండ్​కు సంబంధించే ఇప్పుడు చిన్న పిల్లల ఫొటోలు పోస్టు చేసింది. ఈ క్రమంలోనే గురువారం కూడా షేర్​ చేసింది. కానీ, అది రాహా ఫొటో అంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. అయితే దానిపై ఆలియా స్పందిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news