ఆర్ ఆర్ ఆర్: ఆలియా భట్ పార్ట్ ఇంకా మిగిలే ఉంది..

Join Our Community
follow manalokam on social media

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరెకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్ ఒకానొక హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇప్పటికే కొద్ది భాగం చిత్రీకరణలో కూడా పాల్గొంది. ఐతే ఈ భాగం రాజమౌళికి పెద్దగా నచ్చలేదని, అందుకే సినిమాలో ఆలియా పార్ట్ ట్రిమ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అవన్నీ గాలివార్తలే అని తేలింది.

ఆలియాతో చిత్రీకరణ జరిపిన భాగం పట్ల రాజమౌళి సంతృప్తిగా ఉన్నాడని, రామ్ చరణ్ తో చేయాల్సిన సీన్ల సమయంలో ఆలియాని మళ్ళీ పిలిపించనున్నాడని, రెండు పాటలు ఆమెతో ఉండనున్నాయని తెలుస్తుంది. ఏప్రిల్ లో ఈ భాగం చిత్రీకరణ జరుపుతారట. ప్రస్తుతం రామ్ చరణ్, ఆచార్య సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఏప్రిల్ లో చిత్రీకరణ జరుగుతుందట. ఈ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన ఆర్ ఆర్ ఆర్, ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుంది.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...