విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ ప్రారంభం అయింది. ఈ భేటీకి దాదాపు గుర్తింపు పొందిన అన్ని పార్టీల నుండి ప్రతినిధులు హాజరు కానున్నారు. కానీ ఈ భేటీకి వైసీపీ మాత్రం దూరంగా ఉండనుంది. ఇక ఒక్కో పార్టీకి 10 నిమిషాలు సమయం విడి విడిగా కేటాయించారు ఎన్నికల కమిషనర్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీకి తమ అభిప్రాయాన్ని బీఎస్పీ, బీజేపీ ప్రతినిధులు చెప్పారు.
బీజేపీ నుంచి పాక సత్యనారాయణ హాజరయ్యారు. అయితే బీఎస్పీ, బీజేపీలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీకి సూచనలు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి గతంలో ఏకగ్రీవాలు జరిపేలా వైసీపీ యత్నించిందని బీఎస్పీ, బీజేపీలు అభిప్రాయపడ్డాయి. అయితే కరోనా కూడా తీవ్రంగా ఉన్న నేపధ్యంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. సీపీఐ కూడా కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు జరపాలని పేర్కొంది, అయితే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాలని ఎస్ఈసీకి సీపీఐ సూచనలు చేసింది. అయితే జనసేన ఎవరినీ పంపలేదు కానీ తన అభిప్రయాన్ని ఒక మెయిల్ లో పంపింది.