బీహార్ ఎలక్షన్స్ : 9 గంటల దాకా 6.74 శాతం పోలింగ్

-

బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు తొలి విడత ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ జరగనుంది. ఇక కోవిడ్-19 అనంతరం దేశంలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. ఒక్కో పోలింగ్ బూత్ లో గరిష్టంగా 1,000 ఓట్లకే పరిమితం చేసింది. అన్ని పోలింగ్ బూత్ లలో శానిటైజర్లు, పీపీఈ కిట్లు, ఇతర పరికరాలను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది.

మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మొహరించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు హెలీకాప్టర్లని కూడా సిద్ధంగా ఇంచింది. బిహార్ ఎన్నికల్లో తొలి గంటలో 5 శాతం పోలింగ్ నమోదు కాగా ఉదయం 9 గంటల వరకు 6.74 శాతం పోలింగ్ నమోదయింది. మరో పక్క నేడు బిహార్ లో పోటాపోటీగా ప్రచార సభలు ఏర్పాటు చేశారు. మూడు సభలలో ప్రధాని మోడీ పాల్గోననుండగా రెండు సభల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. వాల్మీకీ నగర్, దర్భాంగా జిల్లాల్లో రాహుల్ గాంధీ ప్రచార సభలు ఉండగా, పాట్నా, ముజాఫర్‌పూర్, దర్భంగాలలో ప్రధాని మోడీ సభలు ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news