రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో ఎలా వరిస్తుందో ఎవరమూ చెప్పలేం. కొందరు ఎంత కష్టపడుతున్నా కూడా వారికి పదువులు రావు. కానీ కొందరికి మాత్రం ఇట్టే పదువులు వచ్చేస్తుంటాయి. దీంతో వారు చాలా అదృష్ట వంతులుగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు హుజూరాబాద్ నాయకులను చూస్తుంటే కూడా చాలా అదృష్ట వంతులని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడి లీడర్లకు మాత్రం వరుసగా పదువులు వస్తున్నాయి. దీంతో వారిని చూసిన మిగతా రాష్ట్రాల లీడర్లు అయితే మాకెందుకు ఇవ్వట్లేదని బాధపడుతున్నారు.
ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీకి అలాగే టీఆర్ ఎస్‌కు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు అనుకోకుండా వచ్చినవి కావు. ఇటు ఈటల రాజేందర్ అలాగే టీఆర్ ఎస్ పంతాలకు పోయి తెచ్చిన ఉప ఎన్నిక. అందుకే ఇక్కడ గెలిచి తమపంతం నెగ్గించుకోవాలని ఇరు పార్టలు కూడా చాలానే ప్రయత్నిస్తున్నాయి. ఇక టీఆరు్ ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఒకడుగు ముందే ఉంది.
ఇందుకోసం తమకు పోటీ రాకుండా చూసుకునేందుకు కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ క్యాండిడేట్ లిస్టులో నుంచి తప్పించి మరీ ఆయన్ను పార్టీలోకి తెచ్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇక ఈయనతో పాటు హుజూరాబాద్‌కే మరిన్ని పదువులు కట్టబెడుతున్నారు. తాజాగా బీసీ వర్గాల మద్దతు కోసం బీసీ కమిషన్ చైర్మన్ గా అయితే వకుళాభరణం కృష్ణ మోహన్ ను నియమించారు. అలాగే ఎస్సీ ఓట్ల కోసం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండ శ్రీనివాస్ ను సెలెక్ట్ చేశారు. దీంతో పదవులన్నీ వారికేనా అంటూ మిగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.