టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని.. కామెడీ సినిమాలు చేసే హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లరి సినిమాతో.. సినిమా పేరు నే తన ఇంటిపేరుగా మార్చుకున్న నరేష్ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. దాదాపు ఈయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా తెరకెక్కినవే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ కి కామెడీ స్టార్ హీరో అనే పేరు కూడా పడిపోయింది. అంతేకాదు కామెడీ చిత్రాలలో నరేష్ తప్ప ఎవరూ నటించలేరు అన్నంతగా ఆ సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్నాడు.
అయితే కామెడీ చిత్రాలనే నమ్ముకున్న అల్లరి నరేష్ దాదాపు 8 సంవత్సరాల పాటు వరుస ప్లాప్ లతో కొట్టుమిట్టాడాడు. అయితే ఎట్టకేలకు నాంది సినిమాతో భారీ విజయాన్ని అందుకొని మళ్లీ తన కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోని ఇటీవల ఈయన నటించిన “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఈరోజు విడుదలైన సందర్భంగా నిన్న మీడియాతో మాట్లాడిన నరేష్ సినిమా ఇండస్ట్రీలో తన కోరిక అలాగే ఉండిపోయిందంటూ వెల్లడించారు.
ఇంటర్వ్యూలో భాగంగా రాజకీయాలలోకి వస్తారా అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలలోకి నాలాంటి సెన్సిటివ్ గా ఉండే వ్యక్తులు సరిపోరు అయినా నాకు తెలియని సబ్జెక్టు రాజకీయం. నా చిరకాల కోరిక డైరెక్టర్ అవ్వాలని ఆ కోరిక తీరితే చాలు.. ఇక రాజకీయాలపై నాకు మక్కువ లేదు అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు అల్లరి నరేష్ మొత్తానికైతే ఈరోజు విడుదలైన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.