టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది అని తాజాగా టీడీపీ నేత కనక మేడల రవీంద్ర కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే పొత్తు ఉంటుందని తెలిపారు. పార్టీ బలాబలాను బట్టి సీట్లు కేటాయింపు ఉంటుంది. టీడీపీ-జనసేన ఎన్డీఏతో చేరడం.. పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయడం ఫైనల్ అయింది.
రాష్ట్ర భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని పొత్తులు పెట్టుకొని పొత్తుకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై సంయుక్త ప్రకటన చేస్తాయి. పొత్తు వల్ల టీడీపీకి అసంతృప్తులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్లుతున్నాం. 6 లోక్ సభ, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 2 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. పొత్తులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని స్పష్టం చేశారు. సీట్ల లెక్కలు తేలినట్టేనని ఓ స్పష్టత వస్తోంది. ఎలాంటి గందరగోళం లేకుండా పొత్తుల విషయం