ఏపీలో నూతన మంత్రులకు శాఖలు కేటాయింపు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు, మంత్రులుగా మొత్తం 23 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారికి సీఎం చంద్రబాబు శాఖలను కేటాయించారు. అచ్చెన్నాయుడు వ్యయసాయ, సహకార, మార్కెట్ శాఖ..  హోంశాఖ వంగలపూడి అనిత, సత్యకుమార్-ఆరోగ్య శాఖ, పవన్ కళ్యాణ్ కి పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కేటాయించారు. గనుల శాఖను కొల్లు రవీంద్ర కు కేటాయించారు.

పొంగూరు నారాయణ-పట్టణాభివృద్ధి, మున్సిపాలిటీ.. నారా లోకేష్-మానవ అభివృద్ధి ఆనం రామనారాయణరెడ్డి-దేవాదాయ శాఖ, ఫరూఖ్-న్యాయ శాఖ,  నిమ్మల రామా నాయుడు-వాటర్ రిసోర్స్ శాఖ, పయ్యావుల కేశవ్-ఆర్థిక శాఖ, శాసన సభ వ్యవహారాలు, కొలుసు పార్థసారథి-గృహ నిర్మాణం, కందుల దుర్గేష్-పర్యావరణం, సాంస్కృతిక శాఖ కేటాయించారు. సత్యప్రసాద్ కి రెవెన్యూ, స్టాంప్స్, డోల బాలవీరాంజనేయ స్వామి-సంక్షేమం, నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ, గొట్టిపాటి రవి-ఇంధన శాఖ కేటాయించారు.  

Read more RELATED
Recommended to you

Latest news