17వ తేదీన ”అలాయ్ బలాయ్” కార్యక్రమం : ముఖ్య అతిధిగా వెంకయ్యనాయుడు

తెలంగాణ రాష్ట్రం లో అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది దసరా పండుగ సమయం లోనే అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే.. ఈ సారి బండారు దత్తాత్రేయ అందుబాటులో లేక పోవడం కారణంగా…. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆయన కూతురు విజయ లక్ష్మి చేతులతో మీదుగా నిర్వహించనున్నారు.

ఈ 17 వ తేదీన అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహిస్తామని.. జల విహార్ లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ప్రకటించారు.

అంతేకాదు… ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారని తెలిపారు. అన్ని పార్టీ ల నేతలను ఆహ్వానించామని.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లతో పాటు హర్యానా సీఎం ని కూడా అలాయ్ బలాయ్ కి ఆహ్వానించామని చెప్పారు. 2005 లో దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారని గుర్తు చేశారు.