ఇటీవల కాలంలో సెలబ్రిటీల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ చైల్డ్ ఆర్టిస్ట్ గా తమకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఒకరు. ఈ పాప గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమాలో భరతుడి చిన్నప్పటి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్హ ప్రతిభను మెచ్చుకొని సమంత దగ్గరుండి ఆ పాపకి అన్ని సౌకర్యాలను అందజేసింది. ఇక ఈ పాప ప్రతిభ చూస్తే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వా. ఇటీవల చెస్ ఆటలో అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ చిన్నారి.ఇక ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేష్టలతో తన తండ్రితో ఈ పాప చేసే అల్లరి అంతా ఇంతా ఉండదు. ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా ఈ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం . ఇక బన్నీ అలాగే ఇద్దరు పిల్లలు కూడా అల్లు అర్హ.. అల్లు అయాన్ ఇద్దరూ కూడా నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో ఇక ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్హ వర్షంలో చిందులు వేస్తూ తన లాన్ ఏరియా అంతా కూడా చక్కర్లు కొడుతూ వర్షం పడుతుండగా ఈ చిన్నారి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వానలో తడుస్తూ చాలా సంతోషంగా వర్షాన్ని ఎంజాయ్ చేసింది.
ఇక అల్లు అర్హ వీడియోను ఒక రీల్ గా చేసి స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకోగా..నేటిజెన్లు ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు . ముద్దు ముద్దుగా అల్లు అర్హ పరిగెత్తడం చూసి బన్నీ ఫ్యాన్స్ కూడా మురిసిపోతూ ఉండడం గమనార్హం.
https://www.instagram.com/reel/CgMWZGElKT_/?utm_source=ig_web_copy_link