ఆయన లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు అల్లు అర్జున్..

-

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ’18 పేజీస్’ చిత్ర ఫ్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తెలుగు సినిమా కోసం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజీస్ చిత్ర ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.. “కొన్నాళ్ల క్రితం వరకు దక్షిణాది చిత్రాలు కేవలం ఇక్కడి వరకు మాత్రమే పరిమితం అయ్యేవి కానీ ఇప్పుడు మన చిత్రాన్ని ప్రపంచమంతా చూస్తోంది ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన స్థాయి బాహుబలిదనే చెప్పాలి ఈ విషయంలో అతనికి థాంక్స్ కూడా చెప్పాలి.. పుష్ప, కేజిఎఫ్, కార్తికేయ 2, కాంతారా సినిమాలు.. పాన్ ఇండియా స్థాయిని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.. అలాగే ఈ సినిమా నా మనసుకు ఎంతో దగ్గర అయింది ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన సుకుమార్ చేసిన చిత్రమిది ఆయన లేకుంటే ఈరోజు నా జీవితం నా ప్రయాణం ఇలా ఉండేది కాదు ఎప్పటికీ ఆయన మీద ఉండే అభిమానం గౌరవం ప్రేమ అలాగే ఉంటాయి.. అలాగే ఇక ’18 పేజెస్‌’కి గోపీ సుందర్‌ మంచి సంగీతం ఇచ్చారు. ఇలాంటి వంటి మంచి సినిమా తీసినందుకు సూర్యప్రతాప్‌కి థ్యాంక్స్‌. అతడు ఓ మంచి చిత్రం ఇవ్వాలన్న తపనతో తను నాలుగేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాడు. నిఖిల్‌ను హ్యాపీడేస్‌ నుంచి చూస్తున్నా. మంచి కథలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. తను ఈ సినిమాతోనూ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ అద్భుతమైన సంగీతమందించారు. తనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఇక ‘పుష్ప2’ గురించి ఒక్కటే మాట చెబుతా. ఈసారి అస్సలు తగ్గేదేలే. అది మీ మనసుకు నచ్చాలని.. నచ్చుతుందని ఆశిస్తున్నా.. ” అంటూ చెప్పకు వచ్చారు అల్లు అర్జున్.

Read more RELATED
Recommended to you

Latest news