తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ తన వ్యూయర్ షిప్‌ను పెంచుకునేందుకు వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇండియన్, ఐడల్, కామెడీ స్టాక్ ఎక్సేంచ్, అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే లాంటి షోలతో ఇప్పటికే తన వ్యూయర్స్షిప్ను పెంచుకుంది. తాజాగా వ్యూయర్స్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేసేందుకు ఆహా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. తన వ్యూయర్స్‌కు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే..?
ఓటీటీ సంస్థ ‘ఆహా’.. బన్నీ ఫ్యాన్స్ కోసం ఓ బిగ్ సర్‌ప్రైజ్‌నే ప్లాన్ చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఓ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ను ప్లాన్ చేసింది. ఇదే విషయాన్ని ‘ఆహా’ సామాజిక మాధ్యమాల్లో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. “అల్లు అర్జున్‌ని మీరు మాస్‌గా, క్లాస్‌గా చూసుంటారు. ఈసారి ఓ బ్లాక్ బస్టర్ లుక్‌తో ఆహా మీ ముందుకు తీసుకురానుంది. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ కోసం రెడీగా ఉండండి.’ అంటూ పోస్ట్ చేసింది.
ఈ పోస్టు చూసిన బన్నీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. బన్నీతోనే ఓ షో రన్ అవుతోందా లేకుంటే ఆల్రెడీ ఆహాలో రన్ అవుతున్న షోల్లోనే కనిపిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
ICON STAR Allu Arjun ni meeru mass ga, class ga choosi untaru, eesari oka blockbuster look tho aha mee mundu ki teskoni raabothundi… Get ready for 'The Biggest' Announcement!
Any guesses?😉@alluarjun #AlluArjun𓃵 pic.twitter.com/iwjn7Xf3bE— ahavideoin (@ahavideoIN) March 15, 2023