ఎన్‌పీఎస్‌ వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్..

నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఉద్యోగుల కోసం ఈ స్కీమ్.. రిటైర్‌మెంట్‌ తర్వాత స్థిరమైన పెన్షన్‌ అందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి మెరుగైన ఆదాయం, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఎన్‌పీఎస్‌ను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్వహిస్తుంది.. అయితే ప్రతి నెల కొన్ని నిభందనలు మారుతు వస్తున్నాయి.. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కొత్త నిభందనలు అమల్లోకి రానున్నాయని తెలుస్తుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవడానికి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధన ప్రకారం కొన్ని పత్రాలను ఇవ్వడం తప్పనిసరి. చందాదారులు ఈ పత్రాలను అప్‌లోడ్ చేయకపోతే.. వారు ఎన్‌పీఎస్ నుంచి నగదు ఉపసంహరించుకోలేరని గుర్తించుకోండి. ఈ మేరకు పీఎఫ్‌ఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. చందాదారులకు కేవైసీ పత్రాలు సమర్పించడమం తప్పనిసరి అని, ఈ పత్రాలను కచ్చితంగా అప్‌లోడ్ చేసేలా చూడాలని నోడల్ అధికారులు, చందాదారులను పీఎఫ్ఆర్డీఏ కోరింది..

అయితే ఈ పత్రాల్లో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నిధులు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.నగదు విత్‌డ్రా చేసుకునే ముందు మీరు ఎన్‌పీఎస్ ఉపసంహరణ ఫారమ్‌ను అప్‌లోడ్ చేశారో లేదో ముందుగానే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, చిరునామా పత్రాల ప్రకారం ఉపసంహరణ ఫారమ్‌లోని సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతా ప్రూఫ్‌, పాన్ లేదా శాశ్వత పదవీ విరమణ ఖాతా నంబర్ కార్డ్ కాపీ కూడా ఉండాలి.. ఈ పత్రాలలో ఏ ఒక్కటి మిస్ అయిన డబ్బులు డ్రా చేసుకోవడం కుదరదు అని గుర్తుంచుకోండి..