ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండు రాజకీయ సినీ ప్రముఖులు చాలా మంది ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి ప్రయత్నించారు. కానీ ఎందరో పర్యావరణం గురించి పూర్తిగా తెలియక ఇంకా… చెట్లను నరుకుతూ డెవలప్మెంట్ పేరును చెప్పుకుంటూ వారి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. అలంటి వారు అంతా తెలుసుకోవలసిన విషయం ప్రస్తుతం మన దేశంలో చెట్లు తగ్గిపోవడంతో ఆక్సిజన్ శాతం చాలా తగ్గిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఆక్సిజన్ ను కొనుక్కుని బ్రతకాల్సిందే. అందుకే పర్యావరణాన్ని కాపాడి మన భవిష్యత్తు తారలు బాగుండాలని కోరుకుందాం. ఈ రోజున సినీ నటుడు అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర ఒక మొక్కను నాటారు.
ఈయన ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచే బాధ్యతను తీసుకోవాలని మన బాధ్యతను గుర్తు ఎరిగేలా చేశారు. ఇంకా ఎందరో నీతులు చెబుతూ ఆచరణలో పెట్టని వారు అల్లు అర్జున్ ను చూసి నేర్చుకుని మారాలని ఆశిద్దాం.