ట్రాక్టర్ యాక్సిడెంట్: మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు నష్టపరిహారం

గత వారమే దేశంలోనే అత్యంత భయంకరమైన రైలు ప్రమాదం చోరుచేసుకోవడం మరిచిపోకముందే… మళ్ళీ ఏపీలో తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో వట్టిచెరుకూరు గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ లో వెళ్తున్న కూలీలను ఈ విధంగా మృత్యువు వారిని కబళించింది. డ్రైవర్ బాధ్యతారాహిత్యం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ… ఈ ఘటన జరగడం చాలా బాధాకరం, చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రఘాడ సానుభూతిని తెలియచేస్తున్నా అన్నారు. ఈ మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు నష్ట పరిహారంగా అందించనున్నారు.

వీరి కుటుంబాలకు ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని అంబటి రాంబాబు తెలియచేశారు. ఈ ప్రమాదాలను అరికట్టాలంటే కొంచెం ముందు చూపు ఉండడం ముఖ్యం అంటూ పలువురు చెబుతున్నారు.