ప్రమాదానికి గురైన ఏపీ ప్రయాణికులు ఎవ్వరూ మిస్ కాలేదు: మంత్రి అమర్నాధ్ ప్రకటన

గత మూడు రోజుల క్రితం జరిగిన కోరమాండల్ – హౌరా – గూడ్స్ రైలు ప్రమాదంలో ఒరిస్సా , వెస్ట్ బెంగాల్ ప్రజలతో పాటుగా ఏపీ నుండి కూడా కొందరు ప్రయాణికులు ఉన్నారు. అధికారులు తెలియచేస్తున్న వివరాల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 300 కుపైగా ఉందట. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఏపీ నుండి కేవలం ఒక్కరు మాత్రమే మరణించినట్లు కాసేపటి క్రితమే ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ క్లారిటీ ఇచ్చారు, తెలుస్తున్న సమాచారం ప్రకారం గురుమూర్తి అనే వ్యక్తి మరణించారా. అంతే కాకుండా ఈ ట్రైన్ లో ప్రయాణించిన ఎవరూ కూడా మిస్ కాలేదని కంఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదాన్ని మానిటర్ చేసుకుంటూ ఏపీలోని అన్ని కంట్రోల్ రూమ్ లు యాక్టీవ్ గా ఉన్నాయని మంత్రి తెలిపారు.

కొందరు ఇంకా హాస్పిటల్స్ లో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారు కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటకు రావాలని ఆశిద్దాం.