అయాన్‌ బర్త్‌ డే.. బన్నీ ఎమోషనల్‌ పోస్ట్‌

-

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పిల్లలు అయాన్‌, అర్హ చేసే అల్లరి గురించి అందరికి తెలిసిందే. వాళ్లు చేసే అల్లరిని బన్నీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు షేర్‌ చేస్తుంటారు. పిల్లలపై తన ఇష్టాన్ని పలు సందర్భాల్లో బన్నీ వెల్లడించారు. తాజాగా అల్లు అయాన్‌ 6వ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ ట్విటర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ‘నేను ప్రేమ అంటే ఏమిటని చాలా సార్లు ఆలోచించేవాడిని.. నాకు గతంలో ఎన్నో బలమైన ఫీలింగ్స్‌ కలిగినప్పటికీ.. అది ప్రేమో కాదో తెలియలేదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చినా తర్వాత ప్రేమ అంటో ఏమిటో తెలిసింది. యూ ఆర్‌ ది లవ్‌.. లవ్‌ యూ అయాన్‌. హ్యాపి బర్త్‌ డే మై బేబి’ అని పేర్కొన్నారు.

మరోవైపు అయాన్‌ బర్త్‌ డే కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను బన్నీ సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే.. మై బేబి @6’ అని స్నేహ పేర్కొన్నారు. మరోవైపు ఏప్రిల్‌ 8న బన్నీ బర్త్‌ డే కూడా ఉండటంతో ఈ వీక్‌ అంతా వారి ఇంట సందడే సందడి. కాగా, 2011లో బన్నీ, స్నేహల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి 2014లో అయాన్‌ జన్మించాడు.

సినిమాల విషయాన్ని వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అల.. వైకుంఠపురములో చిత్రం విజయంతో బన్నీ మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. అయితే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో.. సినిమా షూటింగ్‌లు రద్దు కావడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news