Allu Sirish : సోష‌ల్ మీడియాకు సెల‌వు ప్ర‌క‌టించిన అల్లువారబ్బాయి.. కార‌ణ‌మ‌దేనా?

-

Allu Sirish: అల్లు అరవింద్ తనయుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు శిరీష్‌.. అవ‌కాశాలు ఎన్నో వ‌చ్చినా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించ‌లేకయారు. త‌న కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కోసం.. ఎన్నోరోజులుగా వేచి చూస్తున్నారు. ఇటీవలే త‌న అదృష్టాన్ని మ‌రోసారి ప‌రీక్షించుకోవడానికి హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జ‌త కట్ట‌నున్నారు. ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట‌. ఈ మూవీతో ఎలాగైనా స‌క్సెస్ కొట్టాల‌ని మ‌నోడు తెగ క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌. ఈ క్యారెక్ట‌ర్ కోసం సిక్స్ పాక్ ట్రై చేస్తున్నాడ‌ట‌.

ఇదిలాఉంటే.. నిన్న అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ త‌న అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ట్విట్ చేశారు. ‘ నా జీవితంలో ఈ ఏడాదిలో నవంబర్ 11 చాలా ప్రత్యేకమైంది. నా కెరీర్‌లోనే ఇది మర్చిపోలేని రోజు. ఎందుకనుకుంటున్నారా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో నేనే చెబుతాను. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాను’ అని శిరీష్‌ ట్వీట్‌ చేశాడు. కాగా ఇప్పుడూ ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. అందులో కొన్ని కామెంట్స్ కి రిప్లై కూడా ఇచ్చాడు శిరీష్.

కొంతమంది ‘అన్నా లవ్‌ సెట్‌ అయిందా? మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అని ప్ర‌శ్నించ‌గా.. కెరీర్ ప‌రంగానే స్పెషల్‌ డే అని మరీ మరీ చెప్పాను సామీ… అని ఫ‌న్నీ రిప్లై ఇచ్చారు. మరో అభిమాని.. ‘ఏంటన్నా? బాలీవుడ్ కి చెక్కెస్తున్నావా? అని అడగడంతో… బ్రో.. నాకు అలాంటి ఆశయాలేమీ లేవు, నా కొత్త సినిమా ఫిక్స్‌ అయింది, సోర్టీ బాగుంది. నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ స్క్రిప్ట్‌ అవుతుందనుకుంటున్నా అంటూ అసలు మ్యాటర్‌ నిన్నే చెప్పేశాడు. దీంతో అల్లు శిరీష్ ఈ సినిమా అయ్యేదాకా సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు అని అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news