‘అల్లూరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పుష్పరాజ్..

-

టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ శ్రీ విష్ణు హీరోగా.. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” అల్లూరి”. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా.. లక్కీ మీడియా బ్యానర్ పై అల్లూరి సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో శ్రీ విష్ణు ఫుల్ లెన్త్ మాస్ రోల్ తో పాటు మొదటిసారి పోలీస్ పాత్ర చేస్తున్నారు.

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలనుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది మూవీ యూనిట్. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు కూడా ముహుర్తం ఫిక్స్‌ అయింది. సెప్టెంబర్‌ 18న అంటే.. రేపు అల్లూరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగనుంది. ఈ కార్యక్రమానికి.. అల్లు అర్జున్‌ ఛీఫ్‌ గెస్ట్‌ గా రానున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news