తెలంగాణ రైతులకు అలర్ట్.. ధరణిలో కొత్తగా 5 మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా ధరణీ పోర్టల్ పై తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. రైతులు వ్యతిరేకించకపోయినా… ప్రతి పక్ష నాయకులు మాత్రం.. ధరణీ పోర్టల్ ను తీసేయాలని.. పాత రిజిస్ట్రేషన్ ను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలోనే…ధరణిలో కొత్తగా 5 మాడ్యూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నకిలీ సర్వే నంబర్లకు చెక్ పెట్టడంతో పాటు కొన్ని లోపాలను సవరించడానికి కొత్త మాడ్యూల్స్ ను జత చేశారు. కొత్త మాడ్యూల్స్ : 1. డిలిటేషన్ ఆఫ్ ఫిక్టీషియస్ సర్వే/సబ్ డివిజన్ నంబర్, 2. మాడిఫై ఆర్గనైజేషన్ పిపిబి, 3. ఆధార్ రిమూవల్ అండ్ అన్ సైన్ ఖాతా, 4. మిస్సింగ్ సర్వే నెంబర్ ఫర్ నోషనల్ ల్యాండ్స్, 5. డిలిటేషన్ ఆఫ్ సోల్డ్ ఔట్ కేస్.