అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ షురూ.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఫోన్లు..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను నిర్వ‌హిస్తోంది. కేవ‌లం 48 గంట‌ల పాటు మాత్ర‌మే ఈ సేల్ కొన‌సాగ‌నుంది. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్లు మాత్ర‌మే ఇందులో పాల్గొనేందుకు వీలుంటుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, యాక్స‌స‌రీలు, కిండిల్‌, ఫైర్ టీవీ స్టిక్స్‌, ఎల్ఈడీ టీవీలు త‌దిత‌ర అనేక ఉత్ప‌త్తుల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

amazon prime day sale started offers huge discounts

సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 11కు చెందిన 64జీబీ వేరియెంట్‌పై రూ.8,400 త‌గ్గింపు ఇస్తున్నారు. అందువ‌ల్ల దీన్ని రూ.59,900 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10 ప్ల‌స్ 8జీబీ, 128జీ వేరియెంట్‌ను రూ.12,201 త‌గ్గింపు ధ‌ర‌తో రూ.52,999 ధ‌ర‌కు, గెలాక్సీ ఎస్10 8జీబీ, 128జీబీ వేరియెంట్‌ను రూ.12,801 త‌గ్గింపుతో రూ.44,999 ధ‌ర‌కు, వ‌న్‌ప్ల‌స్ 7టిప్రొ 8జీబీ, 256జీబీ వేరియెంట్‌ను రూ.4వేల త‌గ్గింపుతో రూ.43,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు.

ఐఫోన్ 8 ప్ల‌స్ 64జీబీ వేరియెంట్ రూ.39,900 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, వన్‌ప్ల‌స్ 7టి 8జీబీ, 256జీబీ వేరియెంట్ రూ.35,999 ధ‌ర‌కు, వివో వి19 8జీబీ, 128జీబీ ఫోన్ రూ.24,990 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. అలాగే రెడ్‌మీ కె20 ప్రొ 6జీబీ, 128జీబీ ఫోన్ రూ.22,999 ధ‌ర‌కు, వివో వి17 8జీబీ, 128జీబీ వేరియెంట్ రూ.21,990 ధ‌ర‌కు, శాంసంగ్ గెలాక్సీ ఎం31 రూ.16,499కు ల‌భిస్తున్నాయి.

వీటితోపాటు ట్యాబ్లెట్ పీసీల‌పై 43 శాతం త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. అలాగే హార్డ్ డిస్కుల‌పై 50 శాతం వ‌ర‌కు, టీవీల‌పై 60 శాతం వ‌ర‌కు, ప‌వ‌ర్ బ్యాంకులు, హెడ్‌ఫోన్స్‌పై 70 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందిస్తున్నారు. పెన్‌డ్రైవ్‌ల‌పై 70 శాతం, మానిట‌ర్ల‌పై 60 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు ఇస్తున్నారు. స్మార్ట్‌బ్యాండ్లు, ఆపిల్ వాచ్‌ల‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొన‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారులు ఉత్ప‌త్తుల‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news