జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి సెటైర్లు పేల్చారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత నాదంటూ తాజాగా ఓ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. పోలవరం ఎంత వరకు వచ్చింది.. ఎప్పుడు పూర్తి అవుతుందో… ఓ అరగంట ప్రెస్ మీట్ పెట్టి.. చెబుతావా అని పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు అంబటి.
యుద్ధం అన్నాడు… సిద్ధం అన్నాడు తిరిగి చూస్తే కనిపించడే అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. అతనికి తిక్కుంది! దానికి బాబు దగ్గర లెక్కుందని మరో ట్వీట్ లో మండిపడ్డారు. యుద్దానికి సిద్ధం అన్నావ్, చంద్రబాబు సంకెక్కావ్, పిరికోళ్ళందరూ కలిసే రండి చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు అంబటి.