China Spy : దిల్లీలో సన్యాసి వేషంలో చైనా స్పై..!

-

దిల్లీలో ఇవాళ ఓ చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను దిల్లీ విశ్వవిద్యాలయం ఉత్తర క్యాంపస్‌ సమీపంలోని మజ్నుకా టిల్లా వద్ద టిబెట్‌ శరణార్థులు నివసించే ప్రాంతంలో గుర్తించారు. మారువేషంలో ఆమె దాదాపు మూడేళ్ల నుంచి అక్కడ ఉంటున్నట్లు సమాచారం. చైనా కోసం ఆమె గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

డోల్‌మా లామా పేరుతో చలామణీ అవుతున్న ఆమె వద్ద తనిఖీలు చేయగా నేపాల్‌లోని కాఠ్‌మాండ్‌కు చెందిన చిరునామా లభించింది. కానీ, ఆమె అసలు పేరు కాయ్‌రో అని తేలింది. ఆమె పురుష బౌద్ధ సన్యాసిలా ఎరుపు రంగు వస్త్రధారణలో.. గుండుతో ఉంది. ఆమె రికార్డులు తనిఖీ చేయగా పలు విషయాలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

ఫారెనర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) ప్రకారం ఆమె కాయ్‌రో పేరుతో చైనా పాస్‌పోర్టు వాడి 2019లో భారత్‌లోకి ప్రవేశించినట్లు తేలింది. పోలీసులు ప్రశ్నించగా తనకు చైనాలోని కమ్యూనిస్టు పార్టీ నేతల నుంచి ప్రాణహాని ఉన్నట్లు చెబుతోంది.  ఆమెకు ఇంగ్లిష్‌, నేపాలీ, మాండరీన్‌ భాషలు వచ్చు. దిల్లీకి చెందిన స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆమె పాత్రపై దర్యాప్తు మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news