విషాదం..సెప్టిక్ ట్యాంక్​ క్లీన్​ చేస్తూ ఊపిరి ఆడక ముగ్గురు మృతి

-

మహారాష్ట్రలోని పూణెలో విషాదం చోటు చేసుకుంది. వాఘోలిలోని సొలాసియా సొసైటీకి చెందిన సెప్టిక్​ ట్యాంక్​ను క్లీన్​ చేస్తుండగా ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఊపిరి ఆడనందుకే వారు మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో 18 అడుగుల లోతు గల సెప్టిక్​ ట్యాంక్​లో ముగ్గురు కార్మికులు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అప్పటికే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వారి మృత దేహాలను ఫైర్​ సిబ్బంది వెలికితీశారు. ఆ తర్వాత మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడో వ్యక్తి మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. మృతి చెందిన వ్యక్తులను నితిన్​ ప్రభాకర్​ గోడ్​, గణేశ్​ భలేరోతో పాటు సతీశ్​ కుమార్​ చౌదరీగా పోలీసులు గుర్తించారు.

కార్మికులు దుర్మరణం వార్త తెలుసుకున్న వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఇంటికి ఉన్న ఒక్క ఆసరా కూడా పోయి దిక్కులేని వారమయ్యామని కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news