పాపం వాళ్ళంతా ఈ జన్మ మొత్తం అమెరికాలో ఉండిపోవాల్సిందే ?

-

నిన్న మొన్నటి వరకు గజిబిజిగా సందడి సందడిగా ఉన్న ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకి ఆకారం మొత్తం మారిపోయింది. ఎక్కడ చూసినా మరణ భయం, మరణ కేకలు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కరుణ వైరస్ కి మందు లేకపోవడంతో ఉన్న కొద్దీ విరుచుకు పడుతోంది. దీంతో ఈ పరిస్థితి నుండి ఎప్పుడు కోలుకుంటామో అని ప్రజలందరూ వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశం అగ్రరాజ్యం అమెరికా. దీంతో అక్కడ ప్రభుత్వం ప్రజలెవరూ బయటకు రాకూడదని చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించడం జరిగింది. ఈ పరిణామంతో చాలామంది దేశంలో ఉన్న ఉద్యోగస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు.Donald Trump's Willful Failure To Protect America | Cognoscentiకాగా ఉన్న కొద్ది వైరస్ అమెరికా దేశంలో బాగా వ్యాపించడంతో కరోనా దెబ్బకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అమెరికాలో పోయే అవకాశం ఉన్నట్లు….ఈ పరిణామంతో హెచ్ 1 బీ వీసాల మీద ఉన్న వారికి భయంకరమైన కష్టాలు రాబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన టైమ్ లో వేరే ఉద్యోగం చేసుకోవటానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిది చాలా కష్టం అని అంటున్నారు. మరోపక్క వీసాల గడువు ముగిసే పరిస్థితి కూడా రావడంతో దాదాపు 20 వేల మంది ఇండియన్స్ స్వదేశాలకు వెళ్ళిపోయే టైం ప్రస్తుతం ఏర్పడిందట.

అయితే కరోనా వైరస్ వల్ల ఇతర దేశాల నుండి విమాన రాకపోకలు మొత్తం అంతా అమెరికా ఆపేయటం జరిగింది. దీంతో ఇప్పటికిప్పుడు హెచ్ 1 బీ వీసాల మీద ఉన్నవారు ఇండియాకి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. మరోపక్క ఎన్నికలు అమెరికాలో వస్తున్నాయి…దీంతో అమెరికా ప్రభుత్వం ఏ క్షణాన్నైనా వీళ్లను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో హెచ్ 1 బీ వీసాల మీద ఆధారపడిన వారి పరిస్థితి పాపం అన్నట్టుగా ఉంది. కరోనా వైరస్ దెబ్బకి జన్మ మొత్తం అమెరికాలోనే ఉండిపోవాల్సి వస్తుందేమో అని కొంతమంది ఈ సమస్యపై కామెంట్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news