ఉల్లి కొరత నేపధ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం…!

-

కరోనా వైరస్ మహారాష్ట్రలో ఎక్కువగా విస్తరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే మహారాష్ట్ర సరిహద్దులను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఉల్లిపాయల పరిస్థితి ఏంటీ…? తెలుగు రాష్ట్రాలకు 80 శాతం ఉల్లిపాయ వచ్చేది మహారాష్ట్ర నుంచే. అక్కడ లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తారు.

హైదరాబాద్ మార్కెట్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతి జరుగుతూ ఉంటుంది. దీనితో ఉల్లి కొరత ఏర్పడటమే కాదు ధర కూడా పెరిగే అవకాశం ఉందని భావించారు. ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కొరతను తగ్గించడానికి గాను మహారాష్ట్ర నుంచి 40 లారీల ఉల్లిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

దీనితో మహారాష్ట్ర నుంచి 40 లారీల ఉల్లి రానుంది. మరో మూడు రోజుల్లో ఈ ఉల్లి హైదరాబాద్ మార్కెట్ కి రానుంది. ఇప్పుడు ఏపీకి దాన్ని ఎగుమతి చేస్తారా లేదా అనేది చూడాలి. కరోనా నేపధ్యంలో ఉల్లి ధరలు ఏపీలో పెరుగుతున్నాయి. ఇప్పుడు దిగుమతి చేసుకుంటే కొరత లేకుండా ఉంటుంది. మరి జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా ఏపీలో ఉల్లి కర్నూలు జిల్లాలో బాగా సాగు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news