భార‌త్‌కు భారీ సంఖ్య‌లో అమెరికా వెంటిలేట‌ర్లు, వైద్య‌ సామ‌గ్రి స‌ర‌ఫ‌రా..!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో గాని అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఊహించని విధంగా కరోనా కేసులు ఇప్పుడు అమెరికాలో నమోదు అవుతున్నాయి. లక్ష మంది ప్రజలు అక్కడ కరోనా బారిన పడ్డారు. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.

ఇక అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రభుత్వం కూడా దాదాపుగా చేతులు ఎత్తేసింది. ఇది పక్కన పెడితే అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ పై పోరాట౦ చేస్తున్న దేశాలకు భారీగా సాయం ప్రకటించింది. 64 దేశాలకు అమెరికా సాయం ప్రకటించింది. ఇందుకోసం 174 మిలియన్ డాలర్లను అమెరికా ప్రకటించడం గమనార్హం.

తక్షణం ఆ సాయాన్ని అమెరికా ఆయా దేశాలకు అందించనుంది. ఇక మన దేశానికి కూడా సాయం ప్రకటించింది. 2.9 మిలియన్ డాలర్లను అమెరికా ప్రకటించింది. ఇక భారీగా అమెరికా నుంచి వైద్య పరికరాలు రానున్నాయి. భార‌త్‌కు భారీ సంఖ్య‌లో అమెరికా వెంటిలేట‌ర్లు, వైద్య‌ సామ‌గ్రి స‌ర‌ఫ‌రా జరగనుంది. వీటిని త్వరలోనే భారత్ కి అందించనుంది. ఆ దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news