భారతీయ విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్..1.25లక్షల మంది వీసాలు

-

భారతీయ విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయుల వీసా సమస్యలను పరిష్కరించేందుకు, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అమెరికా తెలిపింది. గత కొన్నేళ్లతో పోలిస్తే 2022లో భారత విద్యార్థులకు అత్యధికంగా వీసాలు జారీ చేసినట్లు వెల్లడించింది.

ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ రోజు వారి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇక 2022లో 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు నేడ్ ప్రైస్ తెలిపారు. 2016 తర్వాత ఒక ఏడాదిలో భారత్ కు అత్యధిక స్టూడెంట్ వీసాలు జారీ చేయడం మళ్ళీ ఇప్పుడే అని తెలిపారు. కాగా, అమెరికా వెళ్లి అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ విద్యార్థుల వాటా 20% ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news