కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌పై రగడ

-

కామారెడ్డిలో మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్‌పై రగడ కొనసాగుతోంది. విలీన గ్రామాల్లోని రైతులతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా 1,200 ఎకరాలను పారిశ్రామిక జోన్‌గా ప్రతిపాదించడంతో బాధితులు రోడ్డెక్కారు. భారీ ఎత్తున బాధితు రైతులంతా ర్యాలీ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎస్‌ఐ చర్చి మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు.

ర్యాలీగా కలెక్టరేట్ చేరుకున్న రైతులు.. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అడ్లూరు ఎల్లారెడ్డి, ఇల్చిపూర్, లింగాపూర్ గ్రామాల రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌లో చాలా వరకు తమ భూములు కోల్పోతున్నామని రైతులు ఆరోపించారు. అధికారులు వెంటనే ఈ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 

“చాలా రోజుల నుంచి మేం గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, 100 ఫీట్ల జోన్‌లు వద్దని చెబుతున్నాం. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ అధికారులు అనుకుంది మాత్రం జరగనివ్వం. అధికారుల ప్లాన్ వల్ల మేం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు కోల్పోతున్నాం. మా ప్రాణాలు పోయినా మా భూములివ్వం.” – బాధిత రైతులు

Read more RELATED
Recommended to you

Latest news