వైరల్ గా మారిన ట్రంప్ డాన్స్..!

-

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విషయం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో కాస్త రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. తర్వాతి అధ్యక్షుడి రేసులో డోనాల్డ్ ట్రంప్ తో పాటు బిడెన్ కూడా పోటీ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అధ్యక్ష రేసులో డోనాల్డ్ ట్రంప్ కంటే బిడెన్ కాస్త ముందంజలో ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ఈ మధ్య ట్రంప్ ఏమి మాట్లాడినా, ఏ పని చేసినా అది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయనకు కరోనా సోకడంతో మొదటగా ఆసుపత్రిలో చేరిన తర్వాత రెండు రోజులకే ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి వైట్ హౌస్ కు వెళ్లడం కూడా జరిగింది. అంతేకాదు అనేక సందర్భాల్లో ఆయన కరోనా వైరస్ ని తక్కువ చేసి మాట్లాడిన రోజులు కూడా లేకపోలేదు. తనకు కరోనా వైరస్ ఉన్న కానీ.. వైట్ హౌస్ వెళ్లగా అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా భయపడిపోయారు. ఇలా ఆయన కరోనా నుంచి కాస్త కోల్పోకొని, ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు మద్దతు తెలపడానికి వచ్చిన అందరిని కూడా ముద్దు పెట్టుకోవాలని ఉందని వ్యాఖ్యానించడం లాంటి ఎన్నో పనులు సంభందించిన విడియోలు వైరల్ గా మారిపోతున్నాయి.

ఇకపోతే తాజాగా తాను ఆరోగ్యపరంగా చాలా శక్తివంతంగా తయారవుతున్నాని చెప్పుకొచ్చారు. ఫ్లోరిడాలో జరిగిన ప్రచారంలో ఓ చిన్నపాటి డాన్స్ చేసేసాడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు సంబంధించి నెటిజెన్స్ భారీగా స్పందిస్తున్నారు. అయితే ఆ స్టెప్స్ పై పాజిటివ్ గా స్పందించ లేకపోతున్నారు నెటిజెన్స్. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news