ఏ నెల కరెంట్‌ బిల్లు కట్టాలి.. కొంచెం చెప్పరూ..?

-

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఆర్ధిక వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. సామాన్యులకు ఏ ఇబ్బంది రాకుండా… రిజర్వ్ బ్యాంకు నుంచి కరెంట్ బిల్లల చెల్లింపు వరకు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రజలు ఎక్కడా ఆర్ధిక కష్టాలు పడి ఉపవాసం ఉండకూడదు, అప్పుల పాలు కాకూడదు అని వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కరెంట్ బిల్లులు కట్టే విషయంలో కూడా వెసులుబాటు కల్పించారు. కరోనా లాక్ డౌన్ నేపధ్య౦లో బిల్ కొట్టే వ్యక్తులు ఇళ్ళకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి పోయిన నెల బిల్ కట్టమని ఏపీ, గత ఏడాది మార్చ్ నెల బిల్ ఈ నెలలో కూడా కట్టమని తెలంగాణా ప్రకటించాయి. ఇక్కడ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

గత సంవత్సరం సింగల్‌ బెడ్‌ రూమ్‌లో ఉన్న సాహిత్య వెంకట్‌ దంపతులు ఈ సంవత్సరం డ బుల్‌ బెడ్‌ రూమ్‌ కి మారారు.. ఇప్పడు కరెంట్‌ బిల్ ఏ బిల్లు కట్టాలో తెలియక సతమతమవుతున్నారు…

“ఒక వేళ లాస్ట్‌ ఇయర్‌ అయితే.. రెంట్‌ ఉండే వాళ్ళ ఒక వేళ ఇళ్ళు మారితే…

అప్పుడు లాస్ట్‌ ఇయర్‌ సింగల్‌ బెడ్‌ రూమ్‌.. ఇప్పుడు డబుల్‌ బెడ్‌ రూమ్‌..

ప్రస్తుతం ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ బిల్లు కట్టాలా..? లేక లాస్ట్‌ ఇయర్‌ ఉన్న సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ది కట్టాలా..

లాస్ట్‌ ఇయర్‌ సింగల్‌ బెడ్‌ రూమ్‌ బిల్లు వారు వాడిన ప్రకారం తక్కువ.. ఇప్పుడు ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ బిల్లు ఎక్కువ.. ఉదాహరణకు
గత సంవత్సరం మార్చినెలలో సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి బిల్లు 2000 అనుకుంటే.. ఈ సంవత్సరం వీళ్లు ఉండే డబుల్‌ బెడ్‌ రూమ్‌ బిల్లు లాస్ట్‌ మంత్‌ 3000 వచ్చిందనుకుందాం.. ఇక్కడి వరకు బానే వుంది.. అయితే ఇక్కడే ప్రాబ్లం గత సంవత్సరం వీరు ఉంటున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌లో వేరే వాళ్లు ఉన్నప్పుడు వారి బిల్లు 8000 వచ్చింది. ఆ సంవత్సరం ఆ ఇల్లు వాడిన వాళ్ళు రకరకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు వాడి ఉంటారు.. వేరే వాళ్ళు వాడే బిల్లు వీళ్ళు కట్టాలా…? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడి ఉంటారు కదా…

ఏది కట్టాలి…?

ఆ బిల్లు వేరే వాళ్ళు కట్టాలి కాబట్టి జీతం రాకపోవచ్చు… అప్పుడు వెసులుబాటు ఏ విధంగా ఉంటుంది…?

సాహిత్య గత సంవత్సరం సింగిల్‌ బెడ్‌ రూమ్‌లో ఉంది.. పెళ్ళి కావడంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌కి మారారు వెంకట్‌ సాహిత్య దంపతులు.. సాహిత్య ఉన్న సింగల్ బెడ్ రూమ్ లో వేరే ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్ వాడారు… వెంకట్ జీతం తక్కువ. అప్పుడు పరిస్థితి ఏంటీ…? వెంకట్ కూడా వేరే రూమ్ లో ఉండి వచ్చాడు. అప్పుడు వెంకట్ రెండు బిల్లులు కట్టాలా…? ఏ బిల్ కట్టాలి…? మరి వెంకట్ బిల్ కట్టకపోతే వాళ్ళ కనెక్షన్ కట్ అవుతుంది కదా…? కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news