అమెరికా గగనతలంలో మరో అనుమానిత వస్తువు.. కూల్చేసిన ఫైటర్ జెట్

-

అమెరికా గగనతలంలో మరోసారి అనుమానాస్పద వస్తువు కలకలం సృష్టించింది. మిషిగన్​ రాష్ట్రంలోని హురాన్​ సరస్సు ప్రాంతంలో.. 20 వేల అడుగుల ఎత్తులో స్థూపాకార వస్తువు ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  వెంటనే దాన్ని ఫైటర్ జెట్ తో కూల్చేశారు. ఈ మేరకు వైట్​హౌస్ అధికారికంగా వెల్లడించింది. పది రోజుల్లో ఇలా అగ్రరాజ్యం గగనతలంలో అనుమానిత వస్తువులు కనిపించడం ఇది నాలుగోసారి అని తెలిపింది.

“గగనతలంలో సుమారు 20వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న స్థూపాకార వస్తువును గుర్తించాం. అధ్యక్షుడు జో బైడెన్​ ఆదేశాల మేరకు ఎఫ్-16 ఫైటర్​ జెట్​ AIM9x ద్వారా కూల్చేశాం. ఈ ఘటన వల్ల పౌరులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఆర్మీ స్థావరాల సమీపంలో ఆ అనుమానాస్పద వస్తువు సంచరించింది. అయితే దాని వల్ల ఎటువంటి సైనిక ముప్పు లేదు. కానీ విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని భావించి కూల్చివేశాం. దానికి నిఘా సామర్థ్యం ఉందేమోనన్న అనుమానంతో ఈ పని చేశాం. దీనిపై మా బృందం పరిశోధనలు జరుపుతోంది” అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగ్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news