‘చూసుకొని పని చేయండి’.. డ్రోన్ కూల్చివేతపై రష్యాకు అమెరికా వార్నింగ్

-

రష్యాకు అమెరికా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తాము చట్ట ప్రకారమే వెళ్తున్నామని.. రష్యానే కాస్త చూసుకొని పని చేయండని అమెరికా హితవు పలికింది. నల్లసముద్రంలో అమెరికా నిఘా డ్రోన్ కూల్చివేత ఘటనపై తాజాగా అగ్రరాజ్యం స్పందించింది. అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన మేర తమ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రష్యా రక్షణమంత్రి సెర్గి షొయిగుతో మాట్లాడిన అనంతరం అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిస్ఈ వ్యాఖ్యలు చేశారు.

‘అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన మేర అమెరికా తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. రష్యా తన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సురక్షిత పద్ధతిలో బాధ్యతాయుతంగా నడపాలి’ అని ఆస్టిన్‌ హెచ్చరించారు. అలాగే దీనిపై యూఎస్‌ జాయింట్ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్ మార్క్‌ మిల్లే స్పందించారు. వాస్తవంగా ఏం జరిగిందో ఒక అంచనాకు వచ్చేందుకు డ్రోన్‌ వీడియో, డేటాను పెంటగాన్‌ విశ్లేషిస్తోందన్నారు. ఈ దుందుడుకు చర్య ఉద్దేశపూర్వకమని భావిస్తున్నట్లు చెప్పారు.

మంగళవారం రోజున నల్లసముద్రంలో ఎగురుతున్న అమెరికా ఎంక్యూ-9 నిఘా డ్రోన్‌ మార్గంలో రష్యాకు చెందిన రెండు ఎస్‌యూ-27 జెట్‌ విమానాలు ఇంధనం చల్లాయని, తర్వాత అవి నేరుగా ప్రొఫెల్లర్‌ను ఢీకొన్నాయని.. దీంతో తమ డ్రోన్‌ కూలిందని అమెరికా ఆరోపించింది. డ్రోనే తమ జెట్లను తాకి కుప్పకూలిందంటూ ఆ ఆరోపణలను రష్యా తిప్పికొట్టింది. అప్పటి నుంచి ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news