బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి విచారణకు గైర్హాజరయ్యారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది సోమ భరత్ వీడికి సమాచారం అందించారు. రెండోసారి ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో గురువారం ఉదయం నుంచి ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు చేయాల్సిందిగా ఈడీ అధికారులకు లేఖను పంపారు కవిత. కవితా అభ్యర్థన పై ఈడి ఎటు తేల్చకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో కవిత అరెస్టు ఖాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీలో కవిత అరెస్టు కోసం అంతా రెడీ అవుతుందని అన్నారు. ఏ సమయంలోనైనా ఆమెను అరెస్టు చేస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు బండి సంజయ్.