మా పిల్లలు టిక్‌టాక్‌ వాడరు.. ఆ కంపెనీ CEO ఇంట్రెస్టింగ్ సమాధానం..!

-

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ భారత్ సహా చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటోంది. భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ సంస్థ సీఈఓ షో జి చ్యూ యూఎస్‌ కాంగ్రెస్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ‘మీ పిల్లలు టిక్‌టాక్‌ వాడుతున్నారా..?’ అని కాంగ్రెస్ సభ్యులు ఆయన్ని ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

తన పిల్లలు టిక్‌టాక్ ఉపయోగించరంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చ్యూ వెల్లడించారు. ‘వారు సింగపూర్‌లో ఉంటారు. ఆ దేశంలో 13 ఏళ్లలోపు పిల్లలకు.. టిక్‌టాక్‌ చైల్డ్‌ వెర్షన్ అందుబాటులో లేదు. ఈ వెర్షన్ అమెరికాలో అందుబాటులో ఉంది. నా పిల్లలు అమెరికాలో ఉంటే వారు ఆ యాప్‌ను వాడేందుకు అంగీకరిస్తాను’ అని తెలిపారు.

మరోవైపు.. ‘టిక్‌టాక్‌ కార్యకలాపాలు మొత్తం దాని మాతృసంస్థ బైట్‌డాన్స్‌ నుంచే సాగుతాయి. చైనా కేంద్రంగా బైట్‌డ్యాన్స్  పనిచేస్తోంది. టిక్‌టాక్ యాప్‌ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోదు. అలాగే 150 మిలియన్ల అమెరికన్‌ యూజర్ల డేటాకు ఇది ఎలాంటి ప్రమాదం కలిగించదు’ అంటూ తన సంస్థ విధానాలను చ్యూ పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news