సిక్స్ ఫర్ జస్టిస్, ఖలిస్థానీ సెపరేటిస్ట్ నిజ్జర్ హత్య కేసులో భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా కూడా భారత్‌కు వ్యతిరేకంగా మారింది.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలకు అగ్రరాజ్యం మద్దతు తెలిపింది. ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్రమైనవని.. నిజ్జర్ కేసు దర్యాప్తునకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్ మాట్లాడుతూ..‘కెనడా చేస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. వాటిని భారత్ సీరియస్‌గా తీసుకుని కెనడాతో దర్యాప్తునకు సహకరించాలి. కానీ, భారత ప్రభుత్వం దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నది. నేను ఈ అంశంలో ఇరుదేశాలు బహిరంగంగా ప్రకటించిన వాటిపై తప్పా అదనంగా మరేమీ మాట్లాడలేను అని చెప్పుకొచ్చారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాగా, అమెరికా కెనడాకు మద్దతు తెలపడంపై
భారత్ ఇంకా స్పందించలేదు. విదేశాంగశాఖ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.