పెళ్లి ప్రపోజల్​కు ఓకే చెప్పిన ఆమిర్ ఖాన్ కూతురు

-

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన ఫ్రెండ్, ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో పెళ్లి ప్రపోజల్ కు ఓకే చెప్పింది. 2020లో ప్రేమలో పడిన ఇరా, నుపుర్ ఇన్​స్టాలో తమ కపుల్​ ఫొటోస్​ షేర్​ చేస్తుంటారు. ఈ ఎంగేజ్​మెంట్​ విషయాన్ని ఇరా ఇన్​స్టాలో ఓ వీడియో ద్వారా షేర్​ చేసింది.

తన చిరకాల మిత్రుడు ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్​ శిఖరే ఆమెకు ప్రపోజ్​ చేశాడు. దాదాపు రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రపోజల్​ను ఇన్​స్టాలో షేర్ చేశారు. అందులో నుపుర్..​ ఇరాకు ఫిల్మీ స్టైల్​లో ప్రపోజ్​ చేశాడు. నుపుర్​ చేసిన ఈ ప్రపోజల్​కు నెటిజన్లు ఫిదా అయ్యారు. నుపుర్ తన సైక్లింగ్ దుస్తుల్లో ఇరా ముందు మోకాలి మీద కూర్చుని “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడిగాడు. వెంటనే నవ్వుతూ ఇరా ‘ఓకే’ నుపుర్ ప్రపోజల్ ను ఓకే చేసింది.
ఓ వైపు నెటిజన్లు మరో వైపు సన్నిహితులు ఈ వీడియోను కామెంట్లతో ముంచెత్తారు. “నేను ఓకే చెప్పాను” అని నుపుర్​ను ఆ వీడియోలో ట్యాగ్​ చేసింది ఇరా. దానికి నుపుర్​ “అవును.. ఆమె ఓకే అని చెప్పింది”అని కామెంట్​ చేశాడు. కొత్త జంటకు అందరూ అభినందనలు తెలిపారు. దీనిపై ఆమిర్ ఖాన్ ఇంకా రెస్పాండ్ కాలేదు.
https://www.instagram.com/p/Ci0Vppej6Z4/

Read more RELATED
Recommended to you

Latest news