తమిళి సైని మందలించిన అమిత్ షా.. స్టేజీ పైనే వార్నింగ్..!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం . మును స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ క్రమం స్టేజీపై కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళసై సౌందర పాటన కు మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేజీపై అటుగా వెళ్తున్న తమిళిసైని అదే స్టేజీపై కూర్చుని అమిత్ షా దగ్గరకు పిలిచి మందలిస్తున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. తమిళసై ఏదో ‘వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ అమిత్ షా మాత్రం ఆమె మాటను వినకుండా హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఆహభావాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విషయంలో తమిళపై చేసిన విమర్శలపై అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా లోక్ సభ ఫలితాలపై తమిళనాడు బీజేపీలో ముసలం పట్టింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు తమిళిసై మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తమిళసై ఇటీవల మాట్లాడుతూ.. బీజేపీలోకి సంఘ్ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై, తమిళిసై మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తమిళిసైని అమిత్ షా హెచ్చరించాలనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ ‘లో వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news