రెండు రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చిన మోదీ ప్రభుత్వం కాసేపటి క్రితమే లోక్ సభలో బిల్లును ప్రవేశ పెట్టి నెగ్గడం జరిగింది. ముఖ్యంగా మహిళలు దేశవ్యాప్తంగా ఈ బిల్లు గురించి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని పార్టీలు వారి సామజిక వర్గాలకు చెందిన మహిళలకు ఈ బిల్లులో చోటు కల్పించకపోవడం వలన వ్యతిరేకతను చూపిస్తున్నాయి. ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ముస్లిం మహిళలలకు రిజర్వేషన్ కల్పించలేదంటూ పార్లమెంట్ లో బిల్లును వ్యతిరేకించాడు. అదే విధంగా ఓబీసీ సామజిక వర్గానికి బిల్లులో అవకాశం ఇవ్వకపోవడంతో సమాజ వాదీ పార్టీ కూడా యాంటీ గా ఉంది. ఈ వ్యతిరేక పార్టీల గురించి మాట్లాడుతూ కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడుతూ … కొందరు తమ తమకు బిల్లులో అవకాశం కల్పించలేదని సపోర్ట్ ఇవ్వడం లేదు.
మీరు వచ్చే బిల్లులకు మద్దతు తెలపకపోతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త బిల్లులు రావడం కష్టం అంటూ అమిత్ షా వారికి కౌంటర్ ఇచ్చారు. మీరు సపోర్ట్ చేస్తేనే ఈ బిల్లులో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది అంటూ అమిత్ షా చెప్పారు.